POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 9:33 pm Posted by : POLITICAL POWER

మద్దిగట్లలో ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వాల్మీకి మహర్షి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, ఉపసర్పంచ్ రవిసాగర్, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మోజర్ల సర్పంచ్ కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే అమ్మపల్లి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గైని వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పి. నారాయణ, మాజీ ఎంపీటీసీ సత్యారెడ్డి, వార్డు సభ్యుడు రమేష్, వాల్మీకి సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.