పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న గుడ్డి కురుమక్క కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’ ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన మేఘన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబానికి అవసరమైన సమయంలో తాము అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ రాములు యాదవ్ పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూత అందించడం ద్వారా వారికి ధైర్యం కల్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఆర్థిక సహాయం అందించినందుకు గుడ్డి కురుమక్క కుటుంబ సభ్యులు మేఘన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి సాగర్, వార్డు సభ్యులు బాలయ్య, ఎస్. రమేష్, గోవర్ధన్ గౌడ్, జనార్ధన్, ఎం. శివరాం, ఎం. రాములు, సాయి కిరణ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీ. మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.