ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నిక
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, ఐ. సత్యరెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కుప్పిరెడ్డి శివారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వి. నరసింహాచారి, కార్యదర్శిగా జుంపాల ఆంజనేయులు, ముఖ్య సలహాదారుడిగా జె. నాగేష్ యాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కె. సత్యరెడ్డి, రామచంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచులు పి. నారాయణ, ఎం. కేశవులు, ఉపసర్పంచులు శివరాజు, కె. కేశవులు గౌడ్, మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, కె. జనార్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగన్న యాదవ్, బుచ్చిలింగం తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.