పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటలకు మోజర్ల-మద్దిగట్ల గ్రామాల్లో బ్యాండ్ మేళంతో వీధి వీధి తిరుగుతూ ప్రభాతభేరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వందేమాతరం, మహనీయులకు నివాళులు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
సీనియర్ ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ… పాఠశాల, సమాజం రెండూ రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. ఆంగ్ల ఉపాధ్యాయురాలు వాణి ప్రభ మాట్లాడుతూ… విద్యార్థులు విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మనోజ్, మౌనిక, మాసన్న గౌడ్ తదితరులు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతపై ప్రసంగించారు. అనంతరం మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గద్వాల కృష్ణ, పుల్లయ్య, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, టీ.కే. ప్రవీణ్ కుమార్, కృష్ణవేణి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కుమార్ దీప్తిని, ఆమె తల్లిదండ్రులు పాలెం రవి, మహాలక్ష్మిని మోజర్ల గ్రామ పెద్దలు దేవేందర్, శ్రీనివాసులు తదితరులు ఘనంగా సన్మానించారు. అలాగే ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావుతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేయడంతో పాటు, విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పెద్దలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.