మద్దిగట్ల–మోజర్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటలకు మోజర్ల-మద్దిగట్ల గ్రామాల్లో బ్యాండ్ మేళంతో వీధి వీధి తిరుగుతూ ప్రభాతభేరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వందేమాతరం, మహనీయులకు నివాళులు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు నిర్వహించారు....