మద్దిగట్ల–మోజర్లలో ఘనంగా బడిబాట కార్యక్రమం
సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యంపై అవగాహన పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లలో గురువారం బడిబాట కార్యక్రమం మరియు తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మద్దిగట్ల, మోజర్ల గ్రామాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు....