ఆలయ అధ్యక్షుడిగా చాపల శివరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కమిటీని గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నూతన అధ్యక్షుడిగా చాపల శివరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వి. నరసింహాచారి, కోశాధికారిగా జల్లి నరసింహను ఎన్నుకున్నారు. వీరితో పాటు 20 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని, గౌరవ అధ్యక్షులను గ్రామ పెద్దలు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ… గ్రామంలోని ఆలయాల్లో నిర్వహించే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ చురుకుగా పాల్గొని, గ్రామ పెద్దలు, మహిళలు, యువత సహకారంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి గ్రామ పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజల సహకారంతో సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలు, యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు.