POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:05 am Posted by : POLITICAL POWER

మద్నూర్‌లో బిఎల్ఒ బిఎల్ఎ లకు ఎస్ఐఆర్ అవగాహన సదస్సు

శ్రద్ధ తో పని చేయాలి _ తహసీల్దార్ ఏం డి ముజీబ్

పొలిటికల్ పవర్ బషీర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మద్నూర్, జూన్ 23 2026: ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఎస్.ఐ.ఆర్ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ వెల్లడించారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలోని బి.ఎల్.ఒ లకు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం, అలాగే బి.ఎల్.ఎ లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో భాగంగా నిర్వహించే ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఒలు, బి.ఎల్.ఎలు సమన్వయంతో పనిచేస్తూ ఈ నెలకు పైగా జరిగే ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో డోంగ్లి తహసీల్దార్ రంజిత్ కుమార్ ఎలక్షన్ సెక్షన్ నాయబ్ తహశీల్దార్ శివ రామకృష్ణ, మద్నూర్ మండల గిర్దావర్ మురళీధర్, సాయిబాబా, ఎలక్షన్ సెక్షన్ అధికారులు యు రవి కుమార్, బాలరాజు, హన్మండ్లు, ప్రవీణ్, దశరథ్ లతో పాటు రెండు మండలాలకు చెందిన బి.ఎల్.ఒలు, బి.ఎల్.ఎలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.