Date of Publish : 11 November 2026, 7:59 pmPosted by : POLITICAL POWER
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 12. 2026.మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తకోట ఎస్సై. విక్రం హెచ్చరిస్తున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 07వ తేదీన నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోపట్టుబడినవ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.కేసు వివరాలు:ఈ నెల 07-11-2026 మంగళవారం రాత్రి కొత్తకోట పోలీసులు పాలెం జంక్షన్ వద్ద ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గద్వాలకు చెందిన గడ్డం. ఆంజనేయులు అనే వ్యక్తి మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, అతను పరిమితికి మించి అధిక మొత్తంలో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందని అన్నారు.కోర్టు తీర్పు ప్రకారం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, బుధవారం ఆత్మకూర్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన ఆత్మకూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, మొహమ్మద్ ఇతిహార్ నేరం రుజువు కావడంతో నిందితుడు గడ్డం. ఆంజనేయులు కి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. తీర్పు అనంతరం పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల హెచ్చరిక: మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా, జైలు శిక్షలు పడేలా కఠినంగా వ్యవహరిస్తామని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు.