మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలుకే.. బిక్కవోలు పోలీసుల హెచ్చరిక
బిక్కవోలు: పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న రాత్రి 7:57 గంటలకు బలభద్రపురం గ్రామంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో బలభద్రపురం గ్రామానికి చెందిన కొల్లబత్తుల అప్పారావు, తండ్రి వీర్రాజు, వయస్సు 33 సంవత్సరాలు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సెప్టెంబర్ 1న విచారించిన స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్...