POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:11 pm Posted by : POLITICAL POWER

మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు నామమాత్రంగా పిల్లలకు భోజనం పెడుతున్నారని ఆరోపణలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోక రోజుకు రెండు కూరలు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకటే పెడుతున్నారని చెబుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

వారానికి మూడు సార్లు కోడిగుడ్డు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకసారి మాత్రమే పెడుతున్నారని చెబుతున్న విద్యార్థులు

అయితే మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తుందని, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు పెడితే నష్టపోతామని చెబుతున్న వంట కార్మికులు