POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:49 pm Posted by : POLITICAL POWER

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి గణనాథుడి లడ్డూ ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ‘గడప గడపకు గణేష్ లడ్డూ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబం వినాయకుడి ప్రసాదాన్ని స్వీకరించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ పోతుల రామిరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.