
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకర భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. ఇప్పటికే పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలకు కూడా ఈసారి తప్పనిసరిగా వేయించాలని, ప్రతి డోస్ చిన్నారులకు మరింత రక్షణ కల్పిస్తుందని తెలిపారు. పోలియో నిర్మూలనలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతాయుతంగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుంచరామోని రాములు, పోతుల రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, గారేమోని బాలరాజు, కొములయ్య, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్, శేషయ్య యాదవ్, ముప్పురి బుచ్చయ్య, ఉప్పరి రాఘవేంద్ర, కావాలి శివకుమార్, కావాలి ఉషయ్య, బంధి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాం…మన గ్రామాన్ని పోలియో రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం..