POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 4:40 pm Posted by : POLITICAL POWER

మనిగిల్ల గ్రామంలో సర్పంచ్ మార్నింగ్ వాక్‌ – ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా ఆరా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 22 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని సీసీ రోడ్డుపై బైకులు వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లను రహదారి వైపు మార్చేలా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా నిర్మించబోయే అండర్ డ్రైనేజీ పనులను త్వరలో ప్రారంభిస్తామని, వార్డులో అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్‌తో పాటు బోయిన కృష్ణయ్య, ఆనంద్ రెడ్డి, జాజల మహేష్, మేకల చెన్నయ్య, మేకల కురుమన్న, బోయిని యాదయ్య, 2వ వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, కావలి శివ, భూపని బాలరాజు, భూపని కుమార్, మేకల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.