పనులు త్వరలో ప్రారంభం.. చెరువుల కట్టలను పరిశీలించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని వెంకన్న చెరువు, చౌట చెరువుల అలుగుల పటిష్టతకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అచ్చన్న కాలువ అలుగు మరమ్మతులు, రెండు చెరువుల కట్టలపై జంగిల్ కటింగ్, చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలకు స్థానికంగా పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చే సోమవారం నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్ కుమార్, వి.బి. గ్రామ జి.సి. ఈసీ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రామ్ రెడ్డి, వెంకటరెడ్డితో కలిసి రెండు చెరువుల కట్టలను పరిశీలించారు. చెరువుల అలుగుల పటిష్టత, మరమ్మతులు, పూడికతీత పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, ప్రేమ్ కుమార్ రెడ్డి, బోడి గణేష్, తిరుపతయ్య, బాలకృష్ణ, బలరాం యాదవ్, అంజి తదితరులు పాల్గొన్నారు.