పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామంలోని వివిధ వార్డులను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. వార్డుల్లో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార చర్యలపై హామీ ఇచ్చారు. డ్రైనేజీలను దాటేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన సర్పంచ్, గ్రామంలో సుమారు 15 నుంచి 20 ప్రాంతాల్లో డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులను రేపటి నుంచి ప్రారంభిస్తామని గ్రామస్తులకు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని వృథా చేయకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వాడిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అదే విధంగా గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతలు (కమ్యూనిటీ సోక్ పిట్స్) నిర్మాణానికి ఐదు ప్రదేశాలను గుర్తించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముప్పూరు గణేష్ కుమార్, మద్దిరాల శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున్, ముప్పూరి రాములు, బుచ్చయ్య, ముప్పూరు కొండన్న, కుర్మయ్య, సాయికుమార్, వై. బాలకృష్ణ, రమేష్, రాజు, సాయిలు, ఆనంద్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.