మన కోసం మనం జీవిద్దాం.* ఎవరికోసం ఈ పాకులాట? దేనికోసం ఈ హైరానా

*మన కోసం మనం జీవిద్దాం. మన బాధ్యతలను ప్రేమతో నిర్వర్తిద్దాం. మన కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిద్దాం. అలాగే... మనల్ని మనం కూడా ప్రేమించుకుందాం. డబ్బు సంపాదిద్దాం, కానీ ఆనందాన్ని కోల్పోకుండా. ఆస్తులు కూడబెట్టుదాం, కానీ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టకుండా. బంధాలను కాపాడుకుందాం, కానీ మనసుకు ప్రశాంతత లేకుండా కాదు. మనకు నచ్చిన వారితో మరికొంత సమయం గడుపుదాం. మనసారా నవ్వుదాం. ప్రకృతిని ఆస్వాదిద్దాం. మనకు ఇష్టమైన పనులు చేద్దాం. ఎవరినైనా సంతోషపెట్టే అవకాశం వస్తే వదులుకోకూడదు. క్షమించాల్సిన వారిని క్షమిద్దాం. చెప్పాల్సిన ప్రేమను ఈరోజే...