మరుపురాని రాజన్న.. మరువలేని రాజన్న

  ప్రజలతో మమేకమైన నాయకత్వానికి వైఎస్సార్ ఓ ప్రత్యేక అధ్యాయం నాయకులు ఎందరో వస్తారు.. వెళ్తారు. పదవులు మారుతాయి.. ప్రభుత్వాలు మారుతాయి. కానీ కొందరు నాయకులు మాత్రం కాలం గడిచినా ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిగిపోరు. రాజకీయాల్లో తమదైన ముద్ర వేసి, ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన అలాంటి నాయకుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయనను అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే ‘రాజన్న’ అనే పేరు నేటికీ ప్రజల మధ్య వినిపిస్తూనే ఉంది. వైద్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ప్రజా సమస్యలను అర్థం...