రెండోసారి రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి నాగేంద్ర
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 28 2026: 2024లో సంచలనం రేపిన వాల్మీకి ఎస్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు కేసులో కర్ణాటక మంత్రి నాగేంద్ర మరోసారి రాజీనామా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2024లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బును దొంగదారిలో హైదరాబాద్‌లోని కొన్ని కంపెనీలకు మళ్లించారు. ఈ డబ్బును 2024 మే నెలలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు కోసమే మళ్లించారు అని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈ స్కాం పెద్ద సంచలనం సృష్టించింది. సీబీఐ విచారణ కూడా చేపట్టింది. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో ఆ శాఖ మంత్రి నాగేంద్ర అప్పట్లో రాజీనామా చేశారు. మొన్న సిద్ధరామయ్య దిగిపోయి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాగానే మళ్లీ నాగేంద్రకు మంత్రి పదవి దక్కింది. కానీ ప్రతిపక్ష బీజేపీ వాల్మీకి కుంభకోణం అంశాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చి నాగేంద్ర రాజీనామా కోసం పట్టుబట్టింది ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే ప్రమాదం కనిపించడంతో నాగేంద్రతో మళ్లీ రాజీనామా చేయించింది కాంగ్రెస్ హైకమాండ్ మరి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్, ఇంత మంది మంత్రులు వేల కోట్ల అవినీతి చేసినా ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి