
* నవంబర్ 7 (శనివారం) ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభం!
* యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపు!
గార్ల (పొలిటికల్ పవర్ న్యూస్ – మాలోత్ అజయ్ నాయక్):
యువత భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ సమర శంఖం పూరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా, ప్రజల్లో శారీరక దృఢత్వం, అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 07 (శనివారం) ఉదయం 6:00 గంటలకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి 5 కిలోమీటర్ల పరుగు (5K Run) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
“Say No to Drugs” — ఆరోగ్యకర సమాజమే లక్ష్యం!
మాదకద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు, కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో తెలియజెప్పడమే కాకుండా, యువత తమ శక్తిసామర్థ్యాలను క్రీడలు, సన్మార్గంలో మళ్లించేలా ఈ పరుగు ద్వారా బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన సమాజం కోసం అడుగులు వేయండి” అనే ప్రతిజ్ఞతో ఈ రన్ సాగనుంది.
విశేష స్పందన కోసం ఉచిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్!
ఈ 5కే రన్‌లో పాల్గొనే ఆసక్తి కలిగిన యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు క్రింది గూగుల్ ఫారమ్ లింక్ ద్వారా ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.
> 📲 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్:
> 5K Run Registration Form
‘పొలిటికల్ పవర్’ పిలుపు:
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం సమాజానికి శ్రేయస్కరం కాదు. మహబూబాబాద్ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, శనివారం ఉదయం జరిగే 5K Run ను విజయవంతం చేయాలని ‘పొలిటికల్ పవర్’ పత్రిక పిలుపునిస్తోంది!