POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:46 pm Posted by : POLITICAL POWER

మహబూబాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మందు జిల్లా ఎస్ పి ఎస్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక -కుర్రి సైదయ్య  

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ సెప్టెంబర్ 02 2026: గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ మహబూబాబాద్ నందు సానిటేషన్ ఏజెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీని కార్మికుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్ సారధ్యంలో…… ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న సుమారు 18,000 మంది కార్మికులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతూ జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెడ్ సైడు కాంట్రాక్టు విధానాలు రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా కార్మికుల అకౌంటులో జీతాలు చెల్లించాలి అని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది అని ఆగ్రహ వ్యక్తపరిచారు. కనీస వేతనం నెలకు 26000/- ఇవ్వాలి అని మా కార్మికుల భద్రత కల్పించి ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ ( ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ ) లో విలీనం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ మంత్రిని ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది అని తెలియపరిచారు. గడిచిన సంవత్సరం కాలం ప్రభుత్వ ఆస్పటల్ నందు మరియు మెడికల్ కాలేజీ నందు గతంలో వేసిన టెండర్ కాలం పరిమితి అయిపోయి కూడా 11 నెలలు దాటింది అని ఆయన ఇప్పటివరకు కార్మికుల పక్షాన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ పాత జీతాలతోనే కార్మికులను వెట్టి చాకిరి చేపిస్తున్నారు అని మండిపడినారు. జీవో 60 ప్రకారం ప్రతి కార్మికులకు 15,600/- నూతనము ఉండగా కానీ ప్రతి జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పటల్ కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ….. 10,000/- , 10,500/- , 11,000/- , 11,500/- ఇలా రకరకాలుగా ఇస్తున్నారని కమిషన్ లకు కక్కుర్తి పడుతూ ఆయా ఆయా ఆస్పటల్ ఉన్నత అధికారులు కూడా కాంటాక్ట్ లకు కొమ్ము కాస్తున్నారు. అని మండిపడినారు. ప్రభుత్వ హాస్పిటల్ నందు పనిచేస్తున్న బెడ్ సైడు కాంట్రాక్ట్ కార్మికులు కళ్ళు ఎర్ర చేసే రోజులు దగ్గరపడ్డాయి అని గర్జన చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ కార్మికుల ను హక్కున చేర్చుకోవాలి కోరినారు. అనంతరం మహబూబాద్ జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు, అజ్మీర కిరణ్ కుమార్ రాష్ట్ర కమిటీ ప్రచార కార్యదర్శి ప్రసాదు నూతనంగా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా రాయపురం శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనుష జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా సాంబయ్య, సుజాత, కవిత  జిల్లా కమిటీ కోశాధికారి తెలంగాణ శ్రీను జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిలు మాధవి, వీరన్న, శ్రీలేఖ, శ్రీను జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శి శ్రీధర్, దేవేందర్ కమిటీ సభ్యులుగా బుచ్చమ్మ, ప్రవళిక, అనూష, సైదమ్మ, సుమలత, సునీత, సరిత, సోనీ మరియు హాస్పిటల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మహబూబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కమిటీ ఎన్నిక చేయడం జరుగుతుంది హాస్పిటల్ కమిటీ గౌరవ అధ్యక్షులు బాబా హాస్పిటల్ కమిటీ అధ్యక్షులు అరుణ కుమారి హాస్పిటల్ కమిటీ ఉపాధ్యక్షులు వసంత, శ్రావణి, హాస్పిటల్ కమిటీ ప్రధాన కార్యదర్శి శరత్ హాస్పిటల్ కమిటీ కోశాధికారి సురేష్ హాస్పిటల్ కమిటీ సహాయ కార్యదర్శి మురళీకృష్ణ, చిరంజీవి హాస్పిటల్ కమిటీ ప్రచార కార్యదర్శి మనోజ్, సోనీ హాస్పిటల్ కమిటీ సభ్యులు నరేష్, అనిత, మంగమ్మ, ఉమేష్, ప్రదీప్, లక్ష్మీకాంత, అనిత, ప్రగతి తదితరుల ను ఎంపిక చేయడం జరిగింది.