POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 4:04 pm Posted by : POLITICAL POWER

మహమ్మద్ హుస్సేన్‌పల్లి 32, 33 బూత్‌లలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ పూర్తి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 23 2026: వనపర్తి జిల్లా మూసాపేట్ మండలం మహమ్మద్ హుస్సేన్‌పల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 32వ, 33వ బూత్‌లలో ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన విజయవంతంగా పూర్తయింది. 32వ బూత్‌లో మొత్తం 708 మంది ఓటర్లు ఉండగా, పరిశీలనలో మరణించిన లేదా డబుల్ నమోదైన 38 మంది ఓటర్లను తొలగించారు. దీంతో ప్రస్తుతం 670 మంది ఓటర్లు మిగిలారు. అలాగే 33వ బూత్‌లో మొత్తం 647 మంది ఓటర్లు ఉండగా, మరణించిన లేదా డబుల్ నమోదైన 40 మంది ఓటర్లను తొలగించడంతో, ప్రస్తుతం 607 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా మూసాపేట్ మండల ఆర్ఐ రవిశంకర్, జూనియర్ అసిస్టెంట్ అంజన గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించి, పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన 32వ బూత్ బీఎల్‌ఓ పద్మ, బీఎల్‌ఏ ఎం. దేవన్న యాదవ్ లను అభినందించారు. అలాగే 33వ బూత్ బీఎల్‌ఓ అరుణను లావణ్య, సీమంతమ్మ అభినందిస్తూ, ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.