POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:26 pm Posted by : POLITICAL POWER

మహానంది పల్లి గ్రామపంచాయతీలో టిడిపి శ్రేణుల ఇంటింటి ప్రచారం…

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో స్వర్ణ గ్రామపంచాయతీగా పేరు పొందిన మహానంది పల్లె గ్రామ పంచాయితీ లో తెలుగుదేశం శ్రేణులతో పి.ఎ.సి.ఎస్. సొసైటీ చైర్మన్ కల్లూరి దుగ్గిరెడ్డి కలసి సుమారు 400 కుటుంబాల యజమానులను కలసి వారికి రెండు సంవత్సరములు చంద్రబాబు నాయుడు పరిపాలనలో పొందిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా, అని అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. రానున్న ఎన్నికలలో అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించాలని ఆయన అన్నారు. కూటమి పాలనలోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.