POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 8:22 pm Posted by : POLITICAL POWER

మహా గురుకులంలో సమస్యలు విలయతాండవం చేస్తున్న పట్టించుకోని జిల్లా అధికారులు :- ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ మహా గురుకులంలో విద్యార్థుల సమస్యలు విలయతాండవం చేస్తున్న జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు తోట్లపల్లి మహా గురుకులంను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…… గత విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభం చేసిన మహా గురుకులం రెండవ విద్యా సంవత్సరం పూర్తవుతున్న కూడా అక్కడ ఉంటున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించకుండా వారి సమస్యలు పరిష్కరించకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులు సమస్యలను గాలీకోదలారని వారు పేర్కొన్నారు.విద్యార్థుల మౌలిక వసతులైన త్రాగడానికి సరైన నీటి సదుపాయం లేకుండా ఆరవ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా అదే విధంగా స్నానం చేయడానికి నీరు మరియు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మరుగుదొడ్లల్లోకి నీరు సరఫరా ఆగిపోయిన విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ప్రిన్సిపల్ కనీసం విద్యార్థుల మౌలిక వసతులపై చర్యలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు త్రాగడానికి స్నానం చేయడానికి ఉపయోగిస్తూ రాత్రిపూట ఆ నీరు తాగడానికి వెళ్లాలంటే ఎక్కడ విషపురుగులు కరుస్తాయో అని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని, విద్యార్థులకు ఇవ్వాల్సిన మెనూలో అవకతవకలు చేస్తూ వార్డన్ మరియు ప్రిన్సిపల్ విద్యార్థుల కడుపు కొడుతున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు వారంలో రెండుసార్లు చికెన్ ఇవ్వాల్సి వస్తే ఒక్కో విద్యార్థికి 360 గ్రాములు వారంలో రెండు సార్లు ఇవ్వాలి కేవలం ఒక విద్యార్థికి 120 గ్రాములు చికెన్ ఇస్తూ మిగిలిన 40 గ్రాములు విద్యార్థుల సొమ్మును అప్పనంగా స్వాహా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు డైనింగ్ హాల్ చుట్టూ అపరిశుభ్రంగా ఉంది. విద్యార్థులు హాస్టల్ నుంచి స్కూలుకు పోయే దారిలో మధ్యలో చెక్ డ్యామ్ వాగు పెద్దగా ఉండడంతో విద్యార్థులు కిందపడి గాయాలపాయలవుతున్న కూడా ప్రిన్సిపాల్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ విద్యార్థుల పరిస్థితిని పట్టించుకునే నాధుడే లేడని వారు ఆరోపించారు. ఉన్నఫలంగా పాత గురుకులంలో ఉన్న విద్యార్థులను మహా గురుకులంలోకి తరలించడంతో సరైన సిబ్బంది, వర్కర్లు కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఉన్న పాత గురుకుల విద్యార్థులను ఒక్క నిమిషం పాద గురుకుల పాఠశాలకు పంపించి అక్కడ స్కూలును యధావిధిగా కొనసాగించి మహా గురుకులంకి వచ్చిన విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించి స్కూలును అభివృద్ధి చేయాలని వారు పేర్కొన్నారు. పాత గురుకుల పాఠశాలను యధావిధిగా కొనసాగించి రెండు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించాలని లేనిపక్షంలో విద్యార్థులతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుడిమే సురేష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సుమంత్ కుమార్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.