మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మన్నెం శంకర్‌రెడ్డి

బ్రహ్మంగారిమఠం, పొలిటికల్ పవర్9 టీవీ తెలుగు, కడప జిల్లా ప్రతినిధి ఎం. వెంకటేశ్వర్లు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వైసీపీ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ రఘురాంరెడ్డితో కలిసి మైదుకూరు వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ మన్నెం శంకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో నాయకులు జోగయ్య, బండి సుబ్బరాజ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.