POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 3:09 pm Posted by : POLITICAL POWER

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలుసుకున్న పలు జిల్లాలకు చెందిన నాయకులు. స్థానిక ఎన్నికలు జరిగిన తీరుపై చర్చ.

పొలిటికల్ పవర్ ప్రతినిధి :  నాగరాజు రెడ్డి   తాడేపల్లి /అమరావతితాడేపల్లి

ఈ సందర్భంగా వైయస్.జగన్‌ ఏమన్నారంటే…

1. పార్టీ కేడర్‌ అంతా కసితో గట్టిగా పోరాటం చేశారన్న వైయస్‌.జగన్‌.
2. చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారు, వారికి కూడా బాగా అర్థమయ్యింది.
3. 2024 ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్‌సీపీ ఓటింగ్‌ శాతాలు పెరిగాయని వైయస్‌.జగన్‌ వెల్లడి.
4. ఎన్నికల షెడ్యూలు దగ్గరనుంచి, ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ అరాచకాలు, అన్యాయాలు జరిగినా ఓటింగ్‌ శాతం పెరిగిందన్న వైయస్‌.జగన్‌.
5. సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే… వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఇంకా భారీగా ఓటింగ్‌ పర్సంటేజీ నమోదయ్యేది.
6. ఇది బయటకు వస్తే, తన ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందనే చంద్రబాబు అరాచకాలు చేశాడు.
7. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారన్న వైయస్‌.జగన్‌.
8. ఇవన్నీ దాటుకుని విజయాలు సాధించిన చోట కూడా అక్రమాలకు పాల్పడి, ఫలితాలు తారుమారు చేశారన్న వైయస్.జగన్‌.
9. వైయస్సార్‌సీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ నిందలు మోపి, లేని అబద్ధాలు చెప్పి, ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలు, అక్రమాలను చంద్రబాబు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్న వైయస్‌.జగన్‌.
10. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరిట నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్న వైయస్‌.జగన్‌.

పార్టీ నాయకుల వ్యాఖ్యలు:

11. మా రాజకీయ జీవితాల్లో ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎప్పుడూ చూడలేదన్న నాయకులు.
12. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది.
13. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు బదులు బౌన్సర్లు పెట్టి నడిపారని వెల్లడి.
14. అభ్యర్థుల బంధువులను కిడ్నాప్‌ చేసి, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చారు.
15. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్లు పేరిట చాలా వరకు వైయస్సార్‌సీపీ ఓట్లు తీసేశారు.
16. లెక్కింపు కేంద్రాల్లో కరెంటు ఆపి మరీ ఫలితాలు తారుమారు చేశారు.
17. వైయస్సార్‌సీపీ గెలిచిన చోట పదేపదే రీకౌంటింగ్‌లు చేసి, లెక్కలు తారుమారు చేశారు.
18. వైయస్సార్‌సీపీ అడిగిన చోట రీకౌంటింగ్‌లు మాత్రం చేయలేదు.
19. అధికార పార్టీకి అనుకూలంగా అదనపు బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి, వారిని గెలిపించేలా అక్రమాలు చేశారు.
20. ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయించిన దాడుల కారణంగా గ్రామ గ్రామాన చంద్రబాబు బాధితులు ఉన్నారన్న పార్టీ నాయకులు.