మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అనసూయమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. శనివారం తాటిపాముల గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యుడు గోవింద్, గ్రామ పెద్దలు కలిసి విద్యార్థులకు పలకలు, గణిత కంపాస్ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కేల్స్ పంపిణీ...