POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:54 am Posted by : POLITICAL POWER

మాట ఇచ్చారు…. విద్యార్థులతో మమేకమయ్యారు.

విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి విద్యపట్ల ఇష్టం పెంచాలి.

విద్యార్థులకు భోజనం వడ్డించిన మాజీ మంత్రి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి “సర్”కార్యక్రమములో భాగంగా వనపర్తి మండలములోని అంజనగిరి గ్రామంలో కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత,మంచినీరు,ఆహార నాణ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించిన విషయం విదితమే. ఆ సందర్భంగా నిరంజన్ రెడ్డి తాను స్వయంగా భోజనం తయారు చేయించి ఏర్పాటు చేస్తానన్న హామీ మేరకు ఈరోజు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించడంతో విద్యార్థులు, ఉపాద్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయులు అధికారులు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజములోనీ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వపరంగా నిర్వహించే విద్యా సంస్థలలో పర్యటనలు చేస్తూ విద్యావసుతులు, మౌలికవసతుల, ఆహార నాణ్యతపై శ్రద్ధ పెట్టీ మెరుగుపరచాలని తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజములో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని అన్నారు.

విద్యార్థులను ఆహ్లాదపరిచిన నిరంజన్ రెడ్డి.

భోజనం అనంతరం విద్యార్థిని, విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి మనకు ఆహారాన్ని అందించే రైతు, రైతుకూలీల విశిష్టత తెలిపి తల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయులను రైతులను గౌరవించాలని ఉద్బోధించారు. చాక్లెట్స్, అరటి పండ్లు ఇచ్చి ముచ్చటించారు. నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల అశోక్,కె మాణిక్యం, సర్పంచ్ నేనావత్ శాంతమ్మ దేవకుమార్, రఘువర్ధన్ రెడ్డి, ధర్మా నాయక్, రవిప్రకాష్ రెడ్డి, మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నరేష్, చిట్యాల రాము, ఉపసర్పంచ్ రాజు, ధర్మేందర్, యాదగిరి, వాసు, తిరుపతయ్య, స్వామి తదితరులు ఉన్నారు.