పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 25 2026: కమలాపురం, జూన్ 25: భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మైభారత్ మరియు మదర్ థెరిసా సేవా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు, అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశాలు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని వారి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డ్రగ్స్ కేవలం వ్యక్తుల ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాలు, సమాజం మరియు దేశ భవిష్యత్తును సైతం నాశనం చేస్తాయని పేర్కొన్నారు. యువత సరదా, మానసిక ఒత్తిడి లేదా స్నేహితుల ప్రభావంతో మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటు నేరప్రవృత్తి పెరుగుతుందని, అక్రమ రవాణా దేశ భద్రతకు ముప్పుగా మారుతోందన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, ఎవరైనా మాదక ద్రవ్యాలు లేదా ఇతర వ్యసనాలను ప్రోత్సహించినప్పుడు ధైర్యంగా యన్ ఓ చెప్పాలని సూచించారు. వ్యసనాలకు బానిసైన వారిని నిందించకుండా వారికి కౌన్సిలింగ్ అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి , లాయర్స్ శరత్ బాబు, పుష్పరాజు, ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మధు,డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చంద్రకాంతమ్మ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మనోహర్, రవితేజ, పారా లీగల్ వాలంటీర్లు, శివ శంకర్, ఈశ్వరయ్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.