
ఖమ్మం, నవంబర్ 9 (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ – బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి):
మామిళ్ళపల్లి
*’వాసవిక ‘* పుట్టినరోజును పురస్కరించుకుని జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. JSPW సంస్థ ప్రతి సోమవారం నిరంతరాయంగా చేపడుతున్న సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఖమ్మం రైల్వే స్టేషన్‌లోని నిరుపేద ప్రయాణికులకు, వృద్ధులకు, వికలాంగులకు సంస్థ ప్రతినిధులు అన్నదానం చేశారు. అనంతరం ఖమ్మం ఓవర్ బ్రిడ్జి కింద, పూజా హాస్పిటల్ ఎదురుగా నివసిస్తున్న అనాథలకు, అభాగ్యులకు భోజన పాకెట్లను అందజేశారు.
ఆకలి తీర్చడమే పరమావధి:
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… “ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే మించిన గొప్ప సేవ మరొకటి లేదు. సమాజంలో ఆదరణకు నోచుకోని నిరుపేదలు, అభాగ్యులు, వికలాంగులు, అనాథలకు అండగా నిలవడమే JSPW ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో నిరుపేదలకు సహాయం చేస్తూ మానవతా విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
హాజరైన ప్రముఖులు:
సమాజహితమే ధ్యేయంగా జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంపై స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో JSPW వ్యవస్థాపక అధ్యక్షులు & చైర్మన్ పెద్దపాక రమేష్, వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు, ప్రధాన కార్యదర్శి నామా వినోద్ కుమార్, ట్రెజరర్ మామిళ్ళపల్లి నాగయ్య జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ అస్గర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యర్ర నాగరాజు రెడ్డి, పులిపాటి నరసింహారావు, చెన్నబోయిన లక్ష్మీనారాయణ, గడదాసు రామారావు, మురికిపూడి బాబురావు, బత్తుల గోపాలరావులతో పాటు పెద్దపొంగు శ్రీకాంత్, అనుముల కార్తీక్, TS GENCO ఉద్యోగి పెద్దపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.