మామిళ్ళపల్లి *వాసవిక* పుట్టినరోజు సందర్భంగా JSPW ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం * ఖమ్మం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆహార వితరణ * మానవతా దృక్పథంతో ప్రతి సోమవారం సేవా యజ్ఞం: JSPW చైర్మన్ పెద్దపాక రమేష్
ఖమ్మం, నవంబర్ 9 (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి): మామిళ్ళపల్లి *'వాసవిక '* పుట్టినరోజును పురస్కరించుకుని జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW) సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. JSPW సంస్థ ప్రతి సోమవారం నిరంతరాయంగా చేపడుతున్న సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం రైల్వే స్టేషన్లోని నిరుపేద ప్రయాణికులకు, వృద్ధులకు, వికలాంగులకు సంస్థ...