POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 9:25 am Posted by : POLITICAL POWER

మార్నింగ్ వాక్‌లో గ్రామ సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోజు ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని రెండో వార్డును సందర్శించి పలు సమస్యలను పరిశీలించారు. వార్డులోని మోరీల శుభ్రత, కంప చెట్ల తొలగింపు పనులను పరిశీలిస్తూ అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అలాగే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా అందుతున్నదా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు ప్రతి స్తంభానికి అమర్చబడి పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించారు. అదేవిధంగా రెండో వార్డు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు రెండో వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, కొండా శేఖర్ రెడ్డి, గొంది ప్రతాప్ రెడ్డి, బంకుల చల్మారెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.