POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 3:20 pm Posted by : POLITICAL POWER

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: పేదల ఇళ్లలో వెలుగుల పండుగ చేద్దాం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తుంబూరు దయాకర్ రెడ్డి

పొలిటికల్ పవర్ (ప్రత్యేక ప్రతినిధి):

రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమైన శుభవేళ, ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకోనున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన దీపావళి పండుగ ఆత్మీయ శుభాకాంక్షలు అందించారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల ముఖాల్లో చిరునవ్వులు, వారి సొంతింటి సంతోషంలో తాను సైతం నేరుగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. పండుగ రోజున స్వయంగా ఇందిరమ్మ ఇంట్లోనే లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోబోతున్నట్లు పేర్కొన్నారు.

నాయకులు, అధికారులకు పిలుపు:

నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తమ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ఈ దీపావళి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.