మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: పేదల ఇళ్లలో వెలుగుల పండుగ చేద్దాం నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తుంబూరు దయాకర్ రెడ్డి

పొలిటికల్ పవర్ (ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమైన శుభవేళ, ఈ దీపావళి పండుగను ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకోనున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన దీపావళి పండుగ ఆత్మీయ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల ముఖాల్లో చిరునవ్వులు, వారి సొంతింటి సంతోషంలో తాను సైతం నేరుగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. పండుగ రోజున స్వయంగా ఇందిరమ్మ ఇంట్లోనే లబ్ధిదారుల కుటుంబాలతో...