POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 5:53 pm Posted by : POLITICAL POWER

మా కుటుంబ అభ్యున్నతిని కోరడమే కాక… ఎన్నో ఏళ్ళు మా కేసులు వాదించిన మంచి మనిషి అడ్వకేట్ సి.హెచ్. సిద్ధారెడ్డి

సీనియర్ అడ్వకేట్ సి.హెచ్. సిద్ధారెడ్డికి రెడ్యం సోదరుల సంతాపం.

సి.హెచ్. సిద్ధారెడ్డి పాడే మోసిన రెడ్యం.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్, కడప నగరం, ప్రకృతి నగర్ లోని నివాసముండే సీనియర్ అడ్వకేట్, కడప బార్ అసోసియేషన్ సభ్యుడు, మా తండ్రి కీ||శే||రెడ్యం(దుంపలగట్టు) సుబ్బారెడ్డి స్నేహితుడు, మా కుటుంబ ఆప్తుడు సి.హెచ్. సిద్ధారెడ్డి (93) అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలు బుధవారం ఉదయం కడప నగరం, పకృతి నగర్ లోని వారి స్వగృహంలో సి.హెచ్. సిద్ధారెడ్డి మృతదేహంపై పూలమాలవేసి ఘన నివాళి అర్పించి, తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సిద్ధారెడ్డి తో వారి కుటుంబ సభ్యులతో తమకున్న అనుబంధాన్ని రెడ్యం సోదరులు గుర్తు చేసుకొని తీవ్ర కలత చెందారు. మంచి మనిషి, నిగర్వి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ధైర్యవంతుడు, మా కుటుంబ క్షేమాన్ని కోరడమే కాక మా తండ్రి కీ||శే|| రెడ్యం సుబ్బారెడ్డి కి ప్రాణ స్నేహితుడు సిద్ధారెడ్డి మృతిని తాము జీర్ణించుకోలేక పోతున్నామని రెడ్యం సోదరులు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. వారి కుటుంబంతో ఉన్న తమ సాన్నిహిత్యానికి గుర్తుగా సి.హెచ్ సిద్ధారెడ్డి పాడెను రెడ్యం మోశారు. సిద్ధారెడ్డి కుటుంబానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇవ్వాలని రెడ్యం సోదరులు ప్రార్థించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యేంతవరకు రెడ్యం సోదరులు అక్కడే ఉన్నారు.