POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 6:46 am Posted by : POLITICAL POWER

మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఐ ఎన్ టి యు సి.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ ఖమ్మం, జూన్ 4 2026: రాష్ట్ర మిషన్ భగీరథ అధ్యక్షులు తలారి రాములు ఆధ్వర్యంలో నగర ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షతన గురువారం స్థానిక మిషన్ భగీరథ ఎస్సీ ఆఫీసులో జరిగిన నిరసన కార్యక్రమంలో కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ… మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా నే జీతాలను అందించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్లో ఉన్న జీతాలను ఇప్పించాలని ఏజెన్సీ లను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

కార్మికులు మాట్లాడుతూ ఐదు నెలలుగా ఏజెన్సీ వాళ్ళు జీతాలు లేకపోవడం అదేవిధంగా కాంట్రాక్టు ఏజెన్సీ వాళ్ల ద్వారా అధికారులు కమిషన్ లు పొంది కేవలం సగటు మనిషి కి కల్పించాల్సిన వేతనాలను కూడా విస్మరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్మికులు వాపోయారు. ప్రజా ప్రభుత్వంలో వారికి న్యాయం జరిగేలా ఐ ఎన్ టి యు సి జిల్లా రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తుందని త్వరలోనే మంత్రి సీతక్క ని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మిషన్ భగీరథ అధ్యక్షులు వేల్పుల అనంత రాములు , ప్రధాన కార్యదర్శి అనుబోతు బాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మధు సుధాన్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి గోడ్ల నర్సింహారావు , కోపూరీ నాగేశ్వరరావు , జంగం నరసింహారావు , ఖాజా, రాజబాబు, ప్రసాద్ కారుమంచి , బమ్మ నరసింహారావు , ఏదునూరి సురేష్ , తాళ్లూరి నవీన్ , తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు