ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట హైడ్రామా
గేట్లకు తాళాలు.. కాంగ్రెస్ నేతల ఆగ్రహం
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ న్యూఢిల్లీ 12 జూన్ 2026: కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఈసీ కార్యాలయం వద్దకు రాగానే, అక్కడి భద్రతా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా, లోపలికి ఎవరినీ అనుమతించబోమంటూ ఈసీ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేతలను, ఎంపీలను కనీసం ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా అనుమతించకపోవడంపై జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్‌లు ఈసీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.