పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 07 2026: పెద్దమందడి మండలం, ముందరి తండా గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆర్మీ ఉద్యోగాలు సాధించిన ఇద్దరు యువకులకు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మణెమ్మ చిన్నా నాయక్ ఆధ్వర్యంలో ఆర్మీలో ఉద్యోగం సాధించిన అర్జున్ టెండూల్కర్ మరియు మేగవత్ గణేష్ నాయక్ లకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తండా నాయకులు మాట్లాడుతూ… తమ తండాకు చెందిన ఇద్దరు యువకులు దేశ సేవకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, యువతకు వీరు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. దేశ రక్షణలో భాగస్వాములు అయ్యే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు మేగవత్ గోపాల్ నాయక్, మూడవత్ రమేష్ నాయక్, పాండు నాయక్, మోహన్ నాయక్, నిలమా మూడవత్, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి, సూర్య నాయక్, పరుశరామ్ నాయక్, వార్డు సభ్యుడు మేగవత్ రమేష్ నాయక్, సేవ్య నాయక్, మేగవత్ కమలాబాయి, వార్డు సభ్యుడు జగన్ నాయక్, మేగవత్ లక్ష్మిబాయి, వార్డు సభ్యురాలు అంజి భాయి, సజని బాయి, వార్డు సభ్యురాలు మూడవత్ స్వప్న సుజాత తదితరులు పాల్గొని యువకులను అభినందించారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగాలు సాధించిన యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సేవలో వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.