POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 11:07 am Posted by : POLITICAL POWER

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: పెద్దమందడి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఇంటి పెద్ద కొడుకులా అండగా నిలుస్తూ సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మేఘారెడ్డి నాయకత్వాన్ని ఎల్లప్పుడూ బలపరుస్తామని తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమకు ఆర్థిక భరోసా కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి-ఘనపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పెద్దమందడి గ్రామ సర్పంచ్ సూర్య గంగ రవి, ఉప సర్పంచ్ ఊశన్న, వివిధ గ్రామాల సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్ నరేష్ కుమార్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, టీఎంఆర్ నాయకులు రాఘవేంద్ర, శ్రీశైలం, గట్టు యాదవ్, సుదర్శన్, సుదర్శన్ రెడ్డి, బాబన్న, శ్రీను, రవి, స్వామి, చిన్న మన్యం, సతీష్, సాయి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.