POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 3:30 pm Posted by : POLITICAL POWER

మున్నేరు నీళ్లపై మౌనమేందుకు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక ప్రతినిధి మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం :
మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల సరిహద్దులో జీవో నెం. 98తో తీవ్ర అలజడి నెలకొంది. మున్నేరు -పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టు పేరుతో తరాతరాలుగా భూమినే నమ్ముకుని బతుకుతున్న గిరిజన రైతుల జీవితాలు సంక్షోభంలో పడుతున్నాయి. వందల ఎకరాల సారవంతమైన సాగుభూములు దెబ్బ తినడంతోపాటు, మున్నేరు పరివాహక ప్రాంతపు సాగునీటి హక్కులు ఇతర ప్రాంతాలకు మళ్ళించే ప్రయత్నాలు జరుగుతున్నాయానే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వెనుక ఎవరి స్వప్రయోజనాలు ఉన్నాయన్నది ప్రశ్నర్థకంగా మారింది. దశాబ్దలుగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు సాగునీరు అందక అన్యాయం జరుగుతుంది. నాగార్జునసాగర్, సీతారామ ప్రాజెక్టుల నీళ్లు ఈ ప్రాంతానికి రాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఆరు దశాబ్దలుగా మున్నేరు రిజర్వాయర్ నిర్మాణం కోసం పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ఇప్పుడు జీ వో 98 పేరుతో ఉన్న నీటిని కూడా పాలేరుకు మళ్ళించే ప్రయత్నాలు జరగడం, గిరిజన భూములకు ముప్పు ఏర్పడటం ఆందోళన ప్రభుత్వంపై ఉంది.గిజనులకు భూమి, నీరు, అడవి కేవలం జీవనధారం మాత్రమేకాదు. వారి సంస్కృతి, ఉనికికి ప్రతీకలు. ఈ వ్యవహారంపై జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ స్పందించి విచారణకు అదేశించింది. అయితే గిరిజనుల భూములకు ముప్పు ఏర్పడిన రాష్టంలోని రాజకీయ పార్టీలు మౌనం వహించడం బాధ్యతరాహిత్యం. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చే నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిచడం లేదు? గార్ల, బయ్యారం, డోర్నకల్ ప్రాంతాల గిరిజనులు, రైతులు, విద్యార్థి, బహుజన సంఘాలు ఐక్యంగా నిలిచి నాయకులను నిలదీయాలి. జీ వో 98ను రద్దు చేసి గిరిజన రైతుల హక్కులను కాపాడే వరకు ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలి. మా నీరు -మా నేల హక్కు అనే నినాదంతో ఐక్యంగా ఉద్యమించి తమ భవిష్యత్తును కాపాడుకోవాలి.

విశ్వ జంపాల, న్యాయ వాది