మురసు తుఫాన్ ఉగ్రరూపం.. నేలమట్టమైన పంటలు.. బోరుమంటున్న అన్నదాతలు! * చేతికొచ్చిన పంట వర్షార్పణం.. జూలూరుపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ * అనంతారంలో ఈదురుగాలులకు కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు
జూలూరుపాడు/అనంతారం (పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక): మురసు తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో తుఫాన్ ధాటికి చేతికందిన పంటలన్నీ నేలమట్టమై తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, మిరప తదితర పంటలు నీట మునిగి ఊడ్చుకుపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా అనంతారం గ్రామ ప్రజలు బోరున విలపిస్తూ.. "తీవ్ర శ్రమకోర్చి...