POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 3:54 pm Posted by : POLITICAL POWER

మురసు తుఫాన్ ముప్పు.. అప్రమత్తమైన ప్రగళ్లపాడు సర్పంచ్ కోరం హనుమంతు! – గ్రామస్థుల ఆరోగ్యామే ధ్యేయంగా వీధివీధినా బ్లీచింగ్ పౌడర్ పిచికారీ – సెక్రటరీని వెంటబెట్టుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్న సర్పంచ్

 

పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ప్రగళ్లపాడు గ్రామపంచాయతీలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ‘మురసు తుఫాన్’ ప్రభావంతో ఎప్పుడూ లేని విధంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో.. గ్రామంలో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా సర్పంచ్ కోరం హనుమంతు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.

దోమల బెడదకు చెక్.. ప్రజల ప్రాణాలే ముఖ్యం!

తుఫాన్ ప్రభావంతో వర్షాలు, నిలకడ నీటి వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెంది, ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే గ్రహించిన సర్పంచ్ కోరం హనుమంతు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా రంగంలోకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని తన వెంట ఉంచుకుని, గ్రామంలోని ప్రతి వీధిలోనూ, మురుగు కాలువల వెంబడి బ్లీచింగ్ పౌడర్ చలింపజేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపించారు.

సర్పంచ్ స్వయంగా పర్యవేక్షణ…

* క్షేత్రస్థాయిలో పరిశీలన: కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, సర్పంచ్ స్వయంగా ప్రతి వీధి తిరుగుతూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.

* ముందస్తు జాగ్రత్తలు: వర్షాకాలం, తుఫాన్ల సమయాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.

* ప్రజల హర్షం: కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుండి శ్రమిస్తున్న సర్పంచ్ కోరం హనుమంతు సేవలను ప్రగళ్లపాడు గ్రామ ప్రజలు, యువకులు కొనియాడుతున్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, గ్రామ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇలాంటి ప్రజాప్రతినిధులే నిజమైన నాయకులని స్థానికులు అభినందిస్తున్నారు.