మురసు తుఫాన్ ముప్పు.. అప్రమత్తమైన ప్రగళ్లపాడు సర్పంచ్ కోరం హనుమంతు! – గ్రామస్థుల ఆరోగ్యామే ధ్యేయంగా వీధివీధినా బ్లీచింగ్ పౌడర్ పిచికారీ – సెక్రటరీని వెంటబెట్టుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్న సర్పంచ్

  పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ప్రగళ్లపాడు గ్రామపంచాయతీలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 'మురసు తుఫాన్' ప్రభావంతో ఎప్పుడూ లేని విధంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో.. గ్రామంలో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా సర్పంచ్ కోరం హనుమంతు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. దోమల బెడదకు చెక్.. ప్రజల ప్రాణాలే ముఖ్యం! తుఫాన్ ప్రభావంతో వర్షాలు, నిలకడ నీటి వల్ల...