*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
*అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వరదల కారణంగా నష్టపోయిన వ్యవసాయ క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పంటా నష్టన్ని అంచనా వేసి భాధిత రైతులకు వెంటనే ఆర్థిక సహాయం అంధజేయాలని భా.ర.స సోయం వీరభద్రం డిమాండ్*
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట వ్యాప్తంగా ఇటీవల సంభవించిన మురాసు తుపాను, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం డిమాండ్ చేశారు. రైతులు ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు వరి ,మొక్కజోన్న,పత్తి, వేరుశెనగ,మురాసు తూఫాన్ కారణంగా పంటలు భారీ మొత్తం లో దెబ్బతినడంతో రైతాంగం తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారంలో ఎలాంటి జాప్యం లేకుండా తగిన పరిహారం అందించాలని,చాలా చోట వరదలకు రోడ్లు కొట్టుకుపోవడం ములంగా రాకపోకలు నిలిచిపొయాయి అని రోడ్లు సంబంధిత శాఖ రోడ్లు మారమ్మత్తులు చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం డిమాండ్ చేశారు*