POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:13 pm Posted by : POLITICAL POWER

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.

ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలు

పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్21: వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు ములకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంజీవ్‌పల్లి, పూసుగూడెం, ములకలపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గుల్లగూడెం, కంపగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామాల్లో ఐక్యత, సోదరభావాన్ని చాటిచెప్పేలా నిర్వహించుకోవడం అభినందనీయమని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.ఆయా గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తాటి వెంకటేశ్వర్లును శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్న ఆయన.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులతో తాటి వెంకటేశ్వర్లు ఆప్యాయంగా ముచ్చటించారు. గణనాథుడి ఆశీస్సులతో ములకలపల్లి మండలంలోని ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనం పద్మ, మాజీ సర్పంచ్ వాడే నాగరాజు, రాజేష్, శనగపాటి సీతారాములు, బండి కొమురయ్య, సునీల్ కుమార్, కొండవీటి చంద్రశేఖర్, పుష్పల హన్మంత్, పుష్పల సాయి, రవి, నరటి రమేష్, అనుమల సాయి, ఇమ్మానియేల్, బొర్ర సుధాకర్, సడియం నరసింహారావు, సడియం అశోక్, సోడే శ్రీనివాస్, సడియం శ్రీను, బొర్ర మోహన్, సడియం ప్రసాద్, సడియం ప్రవీణ్, సడియం కళ్యాణ్, భూక్య నందా, నాగరాజు, శివ, నరేంద్ర, రోహిత్, చరణ్, మహేష్, నీరజ, కుమార్మీడియం మహేష్, బొర్రా రవి, కణితి వినోద్, ఊకె కిరణ్, ఊకె నవీన్, ఊకే గణేష్, ఊకే రాజేంద్ర, సున్నం రాజకుమార్, ఊకే మోటు, ఊకె కిరన్ బాబు తదితరులు అలాగే స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.