ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన
వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు. ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్21: వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు ములకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజీవ్‌పల్లి, పూసుగూడెం, ములకలపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గుల్లగూడెం, కంపగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా...