ముష్టిబండ ఇనాం భూములపై కదిలిన రెవెన్యూ యంత్రాంగం

  వర్షంలోనూ భూముల వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు.. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్23: మండలంలోని ముష్టిబండ గ్రామంలో ఇనాం భూములకు సంబంధించిన వివాదంపై దమ్మపేట రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. గత కొంతకాలంగా తమ భూముల హక్కుల కోసం పోరాడుతున్న ముష్టిబండ దళితుల విజ్ఞప్తి మేరకు దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బిక్షం, జీపీఓ సూరయ్య తదితరులు గ్రామానికి చేరుకుని భూములను పరిశీలించారు. ముష్టిబండకు చెందిన దళిత కుటుంబాలు తమకు...