ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి
భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 26:దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామంలో భూ హక్కులకు సంబంధించిన సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు దళిత రైతులు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను ఆశ్రయించారు. తమకు సంబంధించిన భూముల విషయంలో నెలకొన్న వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చట్టపరంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముష్టిబండ గ్రామంలో తమకు సంబంధించిన భూములకు సంబంధించి గత కొంతకాలంగా సమస్య కొనసాగుతోందని...