POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:46 pm Posted by : POLITICAL POWER

మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

ఎమ్మెల్యే జారే,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి

పొలిటికల్ పవర్, ములకలపల్లి, నవంబర్ 10:మురసు తుఫాను వర్షాలకు తెగిపోయిన మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి.తాత్కాలిక డైవర్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతా ఉన్న వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచి ప్రయాణికులకు మార్గాన్ని పునరుద్దించడం జరిగింది.

వంతెన తెగిపోవడంతో గత కొన్ని రోజులుగా మొగరలగుప్ప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మూకమామిడి పంచాయతీ నుండి ములకలపల్లి మండల కేంద్రానికి వెళ్లే రవాణా పూర్తిగా నిలిచిపోయింది.రైతులు తమ పంటలను మార్కెట్ కు తరలించలేక,విద్యార్థులు పాఠశాలలకు,రోగులు ఆసుపత్రులకు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు.ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేలా చేశారు.జేసీబీలు,హిటాచీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక డైవర్షన్ పనులు చేపట్టారు.
ఈ పనులను మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజి,క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.వాహనాలు సురక్షితంగా వెళ్లేలా దారిని పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ..వంతెన తెగిపోయినప్పటి నుండి మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,ములకలపల్లి మాజీ జడ్పిటిసి బత్తుల అంజి చొరవతో,అధికారులు వెంటనే స్పందించి దారిని పునరుద్ధరించారు.వారికి మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.త్వరలోనే శాశ్వత వంతెన పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు.
వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడటంతో మూకమామిడి,మొగరలగుప్ప గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి,బత్తుల అంజికి,సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు.