మృతుడి కుటుంబానికి గౌతమ్ బుద్ధ సేవా సమితి ఆర్థిక చేయూత
దహన సంస్కారాల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 24: దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని గౌతమ్ బుద్ధ సేవా సమితి సభ్యులు పరామర్శించారు. విషయం తెలుసుకున్న సమితి సభ్యులు పాలడుగుల అబ్బులు, ఎస్కే అజీమ్, రొయ్యల కుమార్ గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల నిర్వహణ నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి తమ...